About Teachers in my life
on Teacher's day in 2019
పసివయసున నడినిసిలో తడబాటుగ అడుగిడిన నను
బడి ఒడిలో చేర్చి వెన్నెల వెలుగుల వైపు నడిపి
లాఘవముగ లఘువును గురువుగ మలచి
గుణ గణ విభజన గావించి ఘనముగా నిలిపి
మన్ను లాంటి నాకు వెన్ను దన్నుగా నిలచి
మేలిమి మెరుగులతో మణిగా మలచి
విధి వశాత్తున విపత్తున నున్న నన్ను
విద్వత్తనే విద్యుత్తును ప్రసరింప జేసిన
షేక్ శ్రీహరి మధు రాజేశ్వరీ రమణ ల
రుణ మీతీరున ఏకొంతైనా తీరేనా?
On Mater's students at the end of their 3rd Semester
నచ్చినజాలు మీకు
మనమ్మున నిల్చిన చాలు
జ్ఞానజ్యోతి విచ్చిన చాలు
అజ్ఞానము చాచిన చాలు
లోకజ్ఞానము వచ్చిన చాలు
బ్రతుకుబాటకు నిచ్చెనగా నిల్చిన చాలు
ప్రతిదినము వచ్చిన చాలు
వినయముతో వినిన చాలు
మీరేమిచ్చిన ఈయకున్న
నిశ్చయమ్ముగ నిలుపుకొందు మిమ్ము మదియందు
దైవకృపతో పచ్చగ నుందురుగాక
ఇక సెలవా నాపని జూసుకోవలెన్
One person who met with me when he was under a depression
ఆశల ఆకాశాన్ని అందాలని
అవకాశాల ఆసరాకై వెదకి, విసిగి
అవసరాల అవరోధాల సుడిలో పడి
తీరం చేరే తీరు తెలియక తెరచాపకై ఎదురుచూసి
తన తలరాతను తిరగేసే ఎదురీతను తరువాతకు బదిలీ చేస్తూ
ఈ తీరుగ నా తోడుగ ఎవరున్నారని ప్రశ్నిస్తే
నేనున్నా నేనున్నానంటూ జనమంతా నీవెంటే
ప్రతివారు రోజూ రాజీలలో రాజులే
కానరానిదాని కళలలోనైనా గనని
కనులముందు అలలా కనిపించిపోనీ
మదిని ఊసులాడు మానిని కోసమని
మాటలన్ని కూర్చి మాలగా పేర్చని
అచ్చమైన చిన్నదాని వెచ్చనైన కౌగిలికని
వెదకితిని వేచితిని విసిగితిని
అయినా
కల కల్ల కాబోదని
జవని జాడ తెలియగలదని
About friendship
నిజానికి నిన్నటినేను నేనుకాను
నేటినేనును నీముందున్నాను
నన్ను నీవానిగా మన్నిస్తావో
నీకు కానివానిగా దూరంగ నిలుస్తావో
నిన్ను నావానిగా అనుకొనే నీనేస్తం
అనాటినేను ఈనాటినేను ఒక్కనిగాలేను
నేను నేనేనా మరెవరన్ననా అన్న
అనుమానమున్న నిన్నటి నన్ను
మనిషిగా మార్చి
కలనైనా కనని మార్పును కలిగించిన నిన్ను
కలనైనా మరువను.
on the people who are not using brains
మోడైన మూఢుల మాడులలోని
మకిలిని వెలికితీసి
మానవత్వాన్ని సమానత్వాన్ని కలిపి నింపి
కంపుగొట్టు ఈ కుళ్ళు లోకంలోని కాకి మూకలకు
కరుణ రసాన్ని కలుగజేసి
జీవన సారాన్ని తెలియ జేసి
కాలంలో కరిగిపోయే
మైనపు మనుషుల మరకల బ్రతుకుల
జగడపు జనుల జీవన ప్రమాణాలే
జాతిఖ్యాతిగా తలచే జనుల రీతికి
తలవంచే తలపుల (thoughts) నుంచి
కసిరేగని వ్యక్తులకోసం
ముసుగేసిన మనుసులకోసం
------- సశేషం
అమ్మతనము కన్న కమ్మదనము సున్న
మంచితనము కన్న మహిని ఏదిమిన్న
సత్యవాక్కు కన్న స్వర్గంబు లెదురన్న
దైవపూజ కన్న జనుల చేరదీయమన్న
అమ్మవి అంటనీవు
కమ్మని పలుకుల తల్లినీవు
జగతి భాదలు దీర్పగ వెలసినావు
మముగాచే జగన్మాతవు
వసుధలోన సుధలుపంచగ వచిన్నావు
అమ్మవి అంటనీవు
వెన్నెలంటి చల్లనైన చిన్నదాని
కంటినిండ తనివితీర చూడని
మల్లెవంటి తెల్లనైన మనసుఉన్న చెలిని
మోము ఎంత ముద్దులొలుకు తున్నదోనని
మలవంటి మేనుఉన్న వన్నెదాని
మనునాడ మనసులోన ఉన్నదని
తలుపులన్ని తెలుపవలెనని
వలపువానన తడిసిపోవాలని
మంచిమాటల మధువులొలికే చిన్నదాని
మనసులోని మర్మమేదొ తెలుసుకోవాలని
-