top of page
Hi, This page will be having parady songs written by me for the tune in the audio file 
For a better experience, you need to read (sing) the lyrics while playing the audio (in low volume)
Note: Any of the contents or parts of the contents in the lyrics are not directly related to my personal experience
00:00 / 03:48
During First lockdown

ఈ కరొన దెబ్బకు బైటకెళ్ళు వీలేలేదసలు

అల రోడ్డుల మీద తిరుగుతుఉంటె పగిలెనే ఒళ్ళు
 

ఈ కరొన దెబ్బకు బైటకెళ్ళు వీలేలేదసలు
అల రోడ్డుల మీద తిరుగుతుఉంటె పగిలెనే ఒళ్ళు
నా పక్కన ఎవ్వరొ తుమ్మిన దగ్గిన కలిగెనే దిగులు

ఐనా ఎందరొ రోజూ అందరికోసం పనిచేసే వాళ్ళు
ఆ వాళ్ళల్లొ కొందరు డాక్టర్లు నర్సులు ఇంకా పోలిసులు
ఇలా ఎందరొ అలా చేస్తుండబట్టే ఉన్నవిలే ఊపిరులు

 

సామజవరగమన.. పగ ఎందుకె మాపైన

మనిషి కెంత గొప్పచిక్కు తెచ్చినావె కరొన
 

సామజవరగమన.. పగ ఎందుకె మాపైన

మనిషి కెంత గొప్పచిక్కు తెచ్చినావె కరొన
 

ఈ కరొన దెబ్బకు బైటకెళ్ళు వీలేలేదసలు

అల రోడ్డుల మీద తిరుగుతుఉంటె పగిలెనే ఒళ్ళు
 

బయటకు రాకుమా భాద్యత నెరుగుమా

ప్రతిపూట కూడ చేతులన్ని శుభ్రం చెయుమా
విసుగని పించినా వ్యధలే మున్నను
మనకెన్ని బాధ లున్న గాని చిన్నవె వినుమా
అరె మనమంతా సైన్యమై మనకోసం నిలచితే

జీవుడే దేవుడు లేరా
మనకోసం ఎందరో ప్రాణాలు లెక్కలేక

మనకుచేయు మరువలేని సేవను గనుమా
 

సామజవరగమన.. కరుణించవ ఇకనైనా
మనుషులన్న నీకు ఉన్న పగని విడుము కరొన

 

సామజవరగమన.. కరుణించవ ఇకనైనా
మనుషులన్న నీకు ఉన్న పగని విడుము కరొన


ఈ కరొన దెబ్బకు ఇల్లు కూడ అయ్యిందే జైలు   

ఈ దుస్థితి చూసి చెడును విడిచి మారేనా జనులు?

మన స్వేచ్ఛను కోరి ఎందరొ చేసిరి స్వచ్ఛమైన మేలు

ఆ మేలును మెచ్చి అందరుకలసి కొడదాం జేజేలు

00:00 / 02:54
feel of a boy in oneside sincere love and fear to exprese it

చిక్కు కున్నానే ప్రేమ సుడి లోనే

ఒక్కసారైనా చేర రానీవే

 

ప్రేమ ప్రేమ అంటూ ఉన్నదే ప్రాణ మన్నది

మళ్ళి మళ్ళీ మనసే నీకై వెదకు తున్నది

 

అందం అందను అంటు ఆనందాలే దూరం చేసే

మోమాటాలే వద్దన్నాయే తెలపాలంటే ప్రేమనే


 

నిన్నే చూసి అయ్యాను నేనె

మేఘం మెరిసి కురిసే వానల్లే

చినుకై నేనిన్ను చేరాలనుకున్న

ఆవిరియై వెనుదిరి గానులే

మాటే పాటయ్యి నీకై వెదికేనులే

రాగంలా దరికి చేరవే

గానంలా మనము ఎన్నడూ

తోడై ఉండాలి ప్రాణమై

పున్నమి వెన్నెలవై రోజూ నాతోనే

ఉండే వరమీవే చాలులే

Inspired by the feelings of one of the friends in SVU from Rajahmundry 

00:00 / 01:04
Situation: Life, after education in 
pharma job

శంకరా ! జాబును (job) చూపించరా

 భాధలు తప్పించరా బ్రతికించరా  

శంకరా ! జాబును (job) చూపించరా

 భాధలు తప్పించరా బ్రతికించరా 

తినుటకు లేదని ఫ్యూచర్ ఏమని దిగులుతో బ్రతికితినీ 

ఎదో ఒకటని దొరికిన చాలని ఫార్మలొ చేరితిని 

తినుటకు లేదని ఫ్యూచర్ ఏమని దిగులుతో బ్రతికితినీ 

ఎదో ఒకటని దొరికిన చాలని ఫార్మలొ చేరితిని 

జీతం చాలని సెలవులె లేని ఈ జాబుతో తలతిరిగే 

జీతం చాలని సెలవులె లేని ఈ జాబుతో తలతిరిగే 

దిక్కులేని ఈడొక్కు జాబుతో చిక్కురా పిచ్చి ఎక్కురా 

నక్కలాగ ఒక్కొక్కడింక నేతెక్కుతుంటె యమతిక్కరా మనకొద్దురా 

శంకరా జీతం సరిపోదురా చేసేదేముందిరా ఇకముందరా 

 

చేసే అప్పులు చేసిన అప్పులు తీర్చుట కుదరదు కాబోలూ 

నెలతిరగంగనే విలవిలలాడుతు వీధిన పడవలె కాబోలూ 

 జాబులేక విలువే లేకా జేబులోన ఏమీ లేక 

నే ఊరుగనక వేడితేఇంక నవ్వుతాడుగా ప్రతికుంకా 

శంకరా భారము నీదేనురా భాదలు తప్పించరా కాపాడరా 

most of the lyrics were recevied as it is from parady song from Jonnavithhula song and changed to pharma job experience

00:00 / 04:05
మందును మించి ముంచెడున్నదా ?

మగువలకంటె మాయ యున్నదా ?

జగమే తెలిపే జీవితసత్యమిదే 

అందరినీ ముంచుశక్తీ వీటికి కలదే 

ఎంతటి ఘనులైనా ఈరెంటితొ చెడునే 

శ్రీరాముడిలాగ నేను ఉండి మాఇంటికే మంచిపేరు తేవాలని 

S.V. యూనివర్సిటీకి నేను ఎన్నో ఆశలతొ ఇక్కడికి వచ్చినాను 

లవ్వంటూ రోడ్లమీద తిరుగుతుంటే ఈలోపల చదువంతా పోయిందే 

లవ్వులోన ఫెయిలయ్యి నేను అయ్యో 

తాగుడుకే బానిసను అయినాను 

రోజంతా తాగితాగి నేను 

ఇల్లు ఒళ్ళంతా గుల్ల చేసుకొన్నాను 

చదువులోన అందరకి మొనగాడినే 

అయినా ఈరెంటితొ ఇలా ఇలా చెడిపోతినే 

మందును మించి ముంచెడున్నదా ?

మగువలకంటె మాయ యున్నదా ?

motivated from friends who had such experiences in SVU

00:00 / 05:33
00:00 / 04:51
On present humans busy life

మనిసెంత మారి పోయాడే మనుషులకు దూరమయ్యాడే

మనిసెంత మారి పోయాడే మనుషులకు దూరమయ్యాడే 

నోరార హాయి అనలేని దుస్థితికి తాను దిగజారి 

మనిసెంత మారి పోయాడే మనుషులకు దూరమయ్యాడే

చరవాణి చేతచిక్కి చెరసాల బ్రతుకు అయ్యే 

మర మనిషి తీరువోలే మతిలేని వాడు అయ్యే 

తెలిసున్న మనిషి ఎదురైతే తప్పించుకోని తిరగేనే 

తెలిసున్న మనిషి ఎదురైతే తప్పించుకోని తిరగేనే 

మనిసెంత మారి పోయాడే మనుషులకు దూరమయ్యాడే

కాలంతో పరుగుతీసి కాసులను కూడబెట్టి 

కన్నోల్లపైన నైనా కరుణంటు లేకపోయే 

నా అన్నవాళ్ళు లేకుండా నలుగురితొ కలువ లేకుండా 

మనిసెంత మారి పోయాడే మనుషులకు దూరమయ్యాడే

కష్ఠాలు చేరినపుడు కావాలి మనకు తోడు 

కాపాడు హితుడు నేడు కావాలి మనకు చూడు 

ఈరోజు మనము కలిసుంటే ప్రతిరోజు కూడ పండగలే 

ఈరోజు మనము కలిసుంటే ప్రతిరోజు కూడ పండగలే 

మనసంటు ఉంటె మారండి మనుషులకు విలువ నివ్వండి 

00:00 / 03:46
Commanman life

ఇదే నేటి రోజు మొసమంటె మోజు 

మనఃశాంతి కరువే మనకు రోజు 

మనఃశాంతి కరువే మనకు రోజు

ఇదే నేటి రోజు మొసమంటె మోజు 

మనఃశాంతి కరువే మనకు రోజు 

​మనఃశాంతి కరువే మనకు రోజు

బ్యాంకులోని డబ్బులుఅన్నీ దొంగలపాలయ్యిన రోజు 

దోచుకున్న దొంగలెనేడూ దర్జాగా తిరిగే రోజు 

బ్యాంకులోని డబ్బులుఅన్నీ దొంగలపాలయ్యిన రోజు 

దోచుకున్న దొంగలెనేడూ దర్జాగా తిరిగే రోజు

మధ్యతరగతి ఆశలన్నీ మట్టిలోపల కలిసిన రోజు 

మధ్యతరగతి ఆశలన్నీ మట్టిలోపల కలిసిన రోజు

రాజకీయ నాయకులంతా మాటలతో ముంచిన రోజు 

ఎంతమంది నాయకులైనా మనబతుకులు మారని రోజు 

రాజకీయ నాయకులంతా మాటలతో ముంచిన రోజు 

ఎంతమంది నాయకులైనా మనబతుకులు మారని రోజు

కష్టపడిన మనుషులకేమో కడుపు కోతలే మిగిలిన రోజు 

00:00 / 03:29

If a boy wants to express his love

లేడీస్ హాస్టల్లో ఉండే అమ్మాయో

నాగుండెల్లోనా అలజడి రేపావే

లేడీస్ హాస్టల్లో ఉండే అమ్మాయో

నాగుండెల్లోనా అలజడి రేపావే

అలజడి గుండెల్లో ప్రేమను రగిలించి

కలలో  దేవతవై కలవర పెట్టావే

నీ అడుగలకే మడుగలు వత్తేవాణ్ణి

నీవంటె పడిచచ్చే వాణ్ణి- నేనేలే

దండాలమ్మా దండాలమ్మా దయచేసి నను ప్రేమించమ్మా

 

నాకే నిను ప్రేమించేటి భాగ్యం కలగిందనుకంటూ

ఈ గుండెల ప్రేమలు పొంగి పండగ చేసేస్తా 

నీవుంటే చాలనుకుంటూ జీవితమంతా ఈ బ్రతుకూ

కలకాలం నీకై నేను బానిస నైపోతా

నీకోసమె జీవితమంతా నీకోసమె నా బ్రతుకంతా

నా గుండెవి నీవే ఊపిరి నీవే తనువూ నీవే నా ప్రాణం కూడా నీవేలే

దండాలమ్మా దండాలమ్మా దయచేసి నువ్ కాదనకమ్మా దండాలమ్మా దండాలమ్మా దయచేసి నను మనువాడమ్మా

first line was inspriration from a friend from Badvel and remaining are inspired by few other friends

Hypothetical situation 

S. V. యూనివర్శిట్లో పరిచయ మయ్యావే

పరిచయంలోనుంచి ప్రేమలొ దించావే

S. V. యూనివర్శిట్లో పరిచయ మయ్యావే

పరిచయంలోనుంచి ప్రేమలొ దించావే

జీవితమంతటికీ నీ జత నేనంటూ

ఆశే రేపావే మోసం చేశావే

నీ వేషాలు దయచేసి వదలేయమ్మ

నీతోటి భాధలు నాకిక చాలిక ఓయమ్మా

దండాలమ్మా దండాలమ్మా ఈ ప్రేమలు నా కొద్దోయమ్మ

మా అమ్మా నాన్న ల మాటను కూడా నేను వినకండా

నీవంటే పిచ్చిగ నేను కుక్కల తిరిగానే

మా సారూ చెప్పిన మాటలు కూడా నేను కాదంటూ

నీతోటే జీవితమంతా అనుకోని తిరిగానే

నీకోసం ఎంతో చేశా నీవంటే పడిపడి చచ్ఛా 

నాఫ్రెండ్సు పోయే చదువూ పోయే డబ్బులు పోయే

నా జీవితమే మునిగిందే

దండాలమ్మా దండాలమ్మా ఈ ప్రేమలు నా కొద్దోయమ్మ

దండాలండి దండాలండి ఈ ప్రేమలు మన కొద్దోయండి 

Many lines are ispriration from many of friends

00:00 / 05:20

motive words for an Innocent and sensitive person who had trobles with roommates

మౌనంగానే కరవమనీ కుక్క నీకు చెబుతుంది 

కరిచేముందు అరవకని అర్థమందులో ఉంది 

పిక్కపట్టి లాగినపుడే నొప్పివిలువ తెలిసొస్తుంది

నొప్పివిలువ తెలిసొస్తేనే కుక్క భాద కనిపిస్తుంది 

కుక్కలెంత అరచినా లెక్కజేయబోకురా 

కుక్కతోక ఎప్పుడూ వంకరేరా 

కుక్కలెంత అరచినా లెక్కజేయబోకురా 

కుక్కతోక ఎప్పుడూ వంకరేరా

తోచినట్టుగా కుక్కలు చాలా మొరుగుతూ ఉంటాయి 

ఆ కుక్కలన్నిటికి లెక్కజూసేటి రోజొకటొస్తుంది 

మనకంటూ ఒకరోజు వస్తుందిరా 

అంతవరకు ఆగినవారికె అది దక్కును లేరా 

తెలుసుకుంటె సూత్రమిదే మలచుకుంటె మార్గమిదే 

చిక్కులెన్ని చేరినా లెక్కజేయఁబోకురా 

దిక్కుతోచు దారులుకూడా వుంటాయిరా 

కష్టమెంత కల్గినా కృంగిపోకు సోదరా 

కష్టములను ఓర్చినపుడే సుఖము దక్కురా 

బుడిబుడినడకల అడుగులు ఎప్పుడు తడబడుటేరా 

ఆ నడకలు ఆగక పరుగుతొ ముందుకు సాగాలిరా 

నీ అడుగుల్లో అడుగేసి ప్రతివాడు నడవాలిరా 

నీ సంకల్పానికి అందరు కలసి జేజే కొట్టాలి 

దారిచూపు దివిటీలా వెలుగురేఖవవ్వాలి 

కలియుగమంతా కలహపుచింత జగమునకంతా ఇదిఒకరోత 

ఈయుగమందు మనుషులయందు గొడవలె అన్ని ఓ దేవా !

జీవితాన సుఖములేని ఓ మనిషీ ఏదీ నీవు మారవా ఒకసారి 

ఓరి ఓరి మారు ఒకసారి 

ఓరి ఓరి మారు ఒకసారి

ఇరువురి మనుషుల నడుమనలో సామి తగవులె ఎపుడూ జరుగునుగా 

చీటికీ మాటికి గొడవలతొ జనులు చిందులు వేయుచునుందురుగా 

జగడములాడేటి జనులంతా వారెవరికి వారే వేరంటా 

మారేనా మారేనా మారేనా 

నచ్చిందా వారితోనె ఈలోకం ఈలోపే వారంటే ఎంతో కోపం 

ఆలూమగలకెప్పుడూ పడనే పడదయా 

ఏమిటో వింతైన ఈమాయ 

నీతోన నేవేగ లేనంటూ నడిచేరు పుట్టింటికి ఆడోళ్ళు 

ఒదొద్దు మొగుడొద్దని కోర్టులకెళ్లి 

విడాకులు పొందు వరకు నిదరే పోరు 

చింతలింత వింతైనపుడింతే జరుగు 

సతిపతి సంగ్రామముతో సంసారమె మునుగు 

తెలియకుండ జేసినా తప్పంతా నీదని నిందేయును వెర్రితోన ఈలోకం 

ఒకసారి ఎవరైనా ఎందుకిలా జరిగెనని యోచించిన గొడవలే ఉండవుగా 

ఓమనిషి కోపమింక చాలున్ చాలున్ 

తెలివితోటి తగవులన్ని తీర్చుట మేలున్ 

బుద్ధుడంటి గొప్పోళ్ళని నేనుకోరను 

బుద్దితొ ఉన్నచో అదియే చాలును.

 

00:00 / 03:57

అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు మారినో 

ఈవెధవలు మారేదేవిధంగానో 

అరెరే ఎన్నడు ఎన్నడు ఎన్నడు ఎన్నడు ఎన్నడు తొలిగేనో  

ఈమూర్ఖులకున్నట్టి అజ్ఞానం 

చదువంటే మరచిన ఈలోకం ఫోనుల్లో మునిగేరు ప్రతిక్షణం 

రోజులో ఏ పూటయైనా సెల్లులో సొల్లులే మాట్లాడుతుంటే 

దానిలో వాట్సాప్ అంటూ ఎప్పుడూ అందరూ చాటింగులేలే 

ఆన్లైన్లో నే ఎప్పుడు జనమంతా యూట్యూబ్ లోని జబర్దస్థ్అంటూ గడిపేరు రోజంతా 

 

నీముందరే ఎంతో జరుగుతున్నా ఊరకే కూర్చుని చూస్తువుంటే 

ఏనాటికో ఒకనాటికైనా మనలనే ముంచును అని తెలుసుకోరే 

ఇకనైనా మీరు మారండి అట్లా కాకుంటే అందరు కూడా మునిగేరు నమ్మండి.

 

చలి చలి చలిరా చలి 

గజ గజ వణికించే చలి 

ప్రొద్దున్నే నిద్దుర లేవాలి లేవాలి

తొందరగానే రడవ్వాలి 

ఎనిమిదికే కాలేజ్ కెళ్ళాలి 

ఆ మేస్సే మాకో నరకం ఈ క్లాసులే బోరు (Bore)

ఎప్పుడూ క్లాసులో నిద్దరే వచ్చులే 

ఏమిటో బాధలు దేవుడా !

The Science & 

Mathematics University

© 2023 by Scientist Personal. Proudly created with Wix.com

  • Facebook Clean Grey
  • Twitter Clean Grey
  • LinkedIn Clean Grey
bottom of page